కూతురుతో కలిసి చిందులేస్తున్న హీరోయిన్ లయ.. వీడియో వైరల్..!

December 27, 2021 at 11:54 am

ఒకప్పుడు తెలుగు తెరపై హీరోయిన్ గా తన సత్తా చాటిన హీరోయిన్ లయ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఈమె సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ.. అమెరికాలో సెటిల్ అయిన ఒక బిజినెస మ్యాన్ ను వివాహం చేసుకుంది. సినీ ఇండస్ట్రీ లో ఉండే కొంతమంది హీరోలతో బాగానే నటించింది. ప్రేమించు సినిమాలో అంధురాలు గా నటించి నంది అవార్డులను కూడా సొంతం చేసుకుంది లయ. తెలుగులో పాటు, తమిళ, కన్నడ, మలయాళం అంటి భాషలలో కూడా ఎన్నో సినిమాలలో నటించింది లయ.

తన కెరియర్ బాగా సాగుతున్న అప్పుడే వివాహం చేసుకుంది. ఇక ఆ తరువాత పది సంవత్సరాలకి.. అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు ఒక చిన్న పాత్రలో కనిపించింది లయ. ఇదే సినిమాలోనే లయ కూతురు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం విశేషం. ఇక క్రిస్మస్ వేడుకలలో భాగంగా లయ తన కూతురు శ్లోక తో కలిసి డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఇక ఆమె అభిమానులను కూడా బాగానే ఆకట్టుకుంటోంది ఈ వీడియో. అయితే కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న లయ సోషల్ మీడియాకు మాత్రం ఎప్పుడు దగ్గరగానే ఉంటుందని చెప్పవచ్చు. ఈమె ఎప్పుడూ ఫ్యామిలీ సినిమాలను చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.ఇక త్రివిక్రమ్ తెరకెక్కించిన.. అరవింద సమేత సినిమాల జగపతిబాబు భార్యగా లయ ను అడగగా ఆమె నేను అమ్మ వదిన పాత్రలు చేయనని తెలియజేసింది. దాంతో ఆ పాత్రను వదులుకోవాల్సి వచ్చిందని లయ ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది

కూతురుతో కలిసి చిందులేస్తున్న హీరోయిన్ లయ.. వీడియో వైరల్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts