ఓరి దేవుడా.. అంటూ వేడుకుంటున్న పాగల్!

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌తో పాటు ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్, ఇటీవల వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నటించిన రీసెంట్ మూవీ పాగల్, బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్‌ను అందుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో ప్రస్తుతం వరుసగా తన సినిమాలను పూర్తి చేస్తున్నాడు ఈ ట్యాలెంటెడ్ హీరో. కాగా తాజాగా విశ్వక్ సేన్ నటిస్తున్న ఓ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను రివీల్ చేశారు చిత్ర యూనిట్.

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘ఓ మై కడవులే’ అనే సినిమాకు ఇది తెలుగు రీమేక్‌గా వస్తోంది. ఇక ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించిన డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. కాగా ఈ సినిమాలో విశ్వక్ సేన్ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఫిదా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో విశ్వక్ సరసన బాలీవుడ్ బ్యూటీ మిథిలా పాలికర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాలో వీరిద్దరి మధ్య నడిచే ట్రాక్ ప్రేక్షకులు ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

కాగా ఈ సినిమాను పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను అతి త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా ఈ సినిమా పూర్తి రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతుండటంతో ఈ సినిమా ఆడియెన్స్‌ను ఖచ్చితంగా మెప్పిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Share post:

Latest