విడాకుల తర్వాత కూడా సమంతని వీడని నాగచైతన్య..!

గత నెల రోజులకు పైగా నాగచైతన్య సమంత విడాకులు వ్యవహారం బాగా హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ గా పేరు పొందిన ఈ జోడి కొన్ని అనివార్య కారణాలవల్ల తమ బంధాన్ని తెంచు కోవడం చాలా హాట్ టాపిక్గా మారింది. అయితే ఇటీవల ఈ సెలబ్రిటీస్ తమ కెరియర్ విషయంలో మాత్రం కాస్త దూకుడు గానే ఉన్నారు.

ఇక ఇదే నేపథ్యంలో సమంత పాటలు నాగచైతన్య కూడా ఒక స్ట్రాంగ్ నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఓటీటిల హవా బాగానే పెరిగింది. దీంతో పాటు స్టార్ హీరో హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లో నటించేందుకు చాలా ఆసక్తి చూపారు. అందులో సమంత కూడా ది ఫ్యామిలీ మాన్-2 తో ప్రేక్షకులను బాగా అలరించింది.

అయితే ఇక తాజాగా నాగచైతన్య కూడా ఆమె అడుగు జాడల్లోనే నడిచేందుకు సిద్ధమయ్యాడు. ఒక హర్రర్ కథతో రూపొందుతున్న వెబ్ సిరీస్ లో చైతన్య నటిస్తున్నారని వార్త బాగా వినిపిస్తోంది. ఇది అమెజాన్ ప్రైమ్ కోసం చేస్తున్న ఈ సిరీస్కు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాగచైతన్య సరికొత్తగా ఉండబోతున్నాడు అనే విషయం తెలుస్తోంది. ఇది డిసెంబర్ నెలలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందట.

Share post:

Latest