టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా..?

ఆకలి రుచి కోరాదు అంటారు. కానీ.. ఈ సామెత సినీ స్టార్స్ కి వర్తించదు. ఎందుకంటే వారు కోరిక ఫుడ్ కోరిన సమయంలో వారి ముందు ఉంటుంది. కానీ.., వీరికి కూడా ఫేవరేట్ ఫుడ్ ఉంటుంది కదా? అది కాస్త ఖరీదు అయ్యి ఉంటుంది అని మీరు అప్పుడే ఫిక్స్ అవ్వకండి. చాలా సాధారణంగా దొరికే కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా మన స్టార్స్ కి ఫేవరేట్ ఫుడ్ ఐటమ్స్ గా ఉన్నాయి. ఇంతకీ ఏ స్టార్ కి ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టమో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ స్టార్స్ లెక్క కాస్త పెద్దది. కాబట్టి వీరి ఫేవరేట్ ఫుడ్ ఏమిటో ముందుగా తెలుసుకుందాం. వందల కోట్ల ఆస్తి ఉన్న మెగా హీరోల ఫేవరేట్ ఫుడ్ ఏమిటో తెలుసా? కాకా హోటల్ లో దొరికే ఓ సాధారణ దోశ. చిరంజీవి మద్రాసులో షూటింగ్ లో పాల్గొనే సమయంలో అక్కడ రోడ్ సైడ్ కాకా హోటల్స్ ఉండేవి. ఆ హోటల్స్ లో చిరు చాలాసార్లు దోశెలు తిన్నారట. ఆ టేస్ట్ చిరుని బాగా ఆకట్టుకుంది. ఆయన అదే రెసిపీని ఇంట్లో ట్రై చేస్తే అద్భుతంగా వచ్చిందట. అప్పటి నుండి మెగా కాంపౌండ్ లో స్టార్స్ అందరికీ ఈ కాకా హోటల్ దోశ ఫేవరేట్ ఫుడ్ గా మాదిరిపోయింది. వీరి డైలీ తినే మెనూలో ఈ దోశ కచ్చితంగా ఉండాల్సిందే అట.

ఇక ఇండస్ట్రీలో డిఫరెంట్ ఫుడ్ ని ఇష్టంగా టేస్ట్ చేసే హీరోయిన్స్ లో సమంత తరువాతే ఎవరైనా అని చెప్పుకోవచ్చు. అలాంటి సమంత ఫేవరెట్ ఫుడ్ విషయానికి వస్తే, ఎక్కువగా హాట్ ఫిల్టర్ కాఫీ, స్వీట్ పొంగల్ అట. కాస్త చెన్నై బ్యాచ్ కదా? కూరగాయలతో చేసే సాంబార్ రైస్ అంటే ఈ అమ్మడికి ప్రాణమట

ఇక మన బల్లాలదేవ రానా ఇష్టంగా తినే ఆహరం ఏమిటో తెలుసా? వాళ్ళ అమ్మగారు చేసే ఊరగాయ, సాంబార్ అంట. నిజమే.. అమ్మ చేతి వంటని మించిన అమృతం ఏముంటుంది?

ఇక అందానికి మారు పేరైన మహేశ్ బాబు ఫేవరేట్ ఫుడ్ ఏమై ఉంటుంది అని మీ డౌట్ కదా? అక్కడికే వద్దాం. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎక్కువగా బిర్యాని, చేపల పులుసు ఇష్టపడే వారట. కానీ.., వయసు వచ్చాక వీటిని తినడం తగ్గించేశారట ప్రిన్స్. ఆరోగ్యం, అందం పట్ల కొన్ని షరతులు పెట్టుకోకుంటే.. ఇప్పటికీ రాజకుమారుడులా ఎలా ఉంటాడు చెప్పండి?

ఇక హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ పంజాబీ అమ్మాయి. కాబట్టి ఈమెకి గులాబ్ జామ్, పరోటాలు అంటే తెగ ఇష్టపడి తింటుందట. కానీ.., రకుల్ ఫిట్ నెస్ కోసం వీటిని పూర్తిగా దూరం పెట్టేసినట్టు తెలుస్తోంది.

ఫుడ్ గురించి చెప్పుకుంటూ మన రాజుగారు ప్రభాస్ గురించి మాట్లాడుకోకపోతే తప్పే అవుద్ది. ప్రభాస్ కి పులస చాప అంటే ప్రాణమట. సీజనల్ గా మాత్రమే దొరికే ఈ ఫుడ్ కోసం ప్రభాస్ ఎక్కడ ఉన్నా, ఆ సమయానికి ఇండియాలో వాలిపోవడం ఖాయమట. చూశారు కదా? ఏ స్టార్స్ కి ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టమో? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Share post:

Latest