త్వరలో గుడ్ న్యూస్ చెబుతానంటున్న సమంత పోస్టు వైరల్..!

అక్కినేని నాగచైతన్యతో విడాకులు తరువాత సమంత కెరీర్ పై బాగా దృష్టి పెట్టింది. వరుస సినిమాలతో బిజీగా ఉండే ప్రయత్నాలు చేస్తోంది ఈమె. ఇక ఇదివరకు కంటే ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలోనే బాగా యాక్టివ్ గా ఉంటోంది సమంత. గత కొద్ది రోజుల నుండి సమంత చాలా ఇంట్రెస్టింగ్ కొటేషన్స్ ను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంది.

తాజాగా కూడా ఇప్పుడు ఒక ఆసక్తికరమైన కొటేషన్ ని షేర్ చేసింది. అదేమిటంటే”త్వరలో మంచి జరగబోతోంది”గుర్తించుకోండి”. అనే కొటేషన్ ని పోస్ట్ చేసింది. ఆ మంచి సమంత కు సంబంధించిన లేక మరెవరికైనా సంబంధించినదా అన్నట్లుగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. విడాకుల అనంతరం సమంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది అని చెప్పుకోవచ్చు. ఆమె ఎటువంటి పోస్టులు పెట్టిన కూడా వాటిని నెట్టింట్లో వైరల్ గా చేస్తున్నారు నెటిజన్స్.

సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం తమిళ్ లో కూడా రెండు సినిమాలలో నటించింది. ఈ సినిమాలన్నీ విడుదలకు సిద్ధమయ్యాయి.

Share post:

Latest