శివ శంకర్ మాస్టర్ వైద్యానికి అయ్యే ఖర్చు భరిస్తా.. ముందుకొచ్చిన సోనూసూద్..!

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా బారినపడి హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన పెద్ద కుమారుడికి కూడా పాజిటివ్ తేలడంతో ఆయన కూడా అపస్మారక స్థితిలో ఉన్నాడు. హాస్పిటల్లో వైద్యానికి రూ.లక్షల్లో ఖర్చవుతుందని.. ఎవరైనా ముందుకొచ్చి ఆదుకోవాలని శివ శంకర్ మాస్టర్ చిన్నకొడుకు విజ్ఞప్తి చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ నటుడు సోనూసూద్ స్పందించారు. శివ శంకర్ మాస్టర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానని సోనూ సూద్ హామీ ఇచ్చారు. శివ శంకర్ మాస్టర్ నాలుగు రోజుల నుంచి హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో కరోనాతో చికిత్స పొందుతున్నారు. ఆయన భార్యకు కూడా వైరస్ సోకడంతో ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు.

కరోనా వైరస్ వల్ల శివశంకర్ ఊపిరితిత్తుల్లో 75% ఇన్ఫెక్షన్ సోకింది. ఆయనను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శివ శంకర్ మాస్టర్ కు వైద్యం అందించేందుకు డబ్బులు సర్దుబాటు కాక ఇబ్బందులు పడుతున్నట్లు నిన్న రాత్రి నుంచి వార్తలు వస్తున్నాయి. ఇది తెలిసి సోనూసూద్ స్పందించారు.

Share post:

Latest