సోషల్ మీడియా బై బై చెప్పేసిన మెగా హీరో..!!

సినీ ఇండస్ట్రీ లో ఉండే గొప్ప ఫ్యామిలీల నుంచి ఏ ఫ్యామిలీ నుంచి ఎక్కువ మంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చారు అంటే అది కేవలం మెగా ఫ్యామిలీ అని చెప్పాలి.. ఎందుకంటే అటు అల్లు అరవింద్ కొడుకులు, చిరంజీవి, నాగబాబు కొడుకులు అలాగే వీరి చెల్లెలి కొడుకులు కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. సుమారుగా ఏడు ,ఎనిమిది మందికి పైగానే మెగా హీరోలు వెండితెరపై నటించడం గమనార్హం. వారిలో ఒకరు అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ సోషల్ మీడియాకు గుడ్బై చెప్పనున్నట్లు సమాచారం.

నవంబర్ 11 ఒక ప్రత్యేకమైన రోజు అని చెబుతూనే త్వరలోనే ఆ ప్రత్యేకమైన రోజు అని ఎందుకు తెలిపానో అనే విషయం కూడా వెల్లడిస్తాను అని తెలిపాడు.నవంబర్ 11, 2021 తన కెరీర్ లోనే బెస్ట్ డే అని, తన సంతోషానికి గల కారణాన్ని త్వరలోనే చెబుతానని అన్నారు. ఈ మేరకు గురువారం రాత్రి ఓ ట్వీట్ చేశారు. ‘నా వృత్తిపరమైన జీవితంలో నవంబర్ 11వ తేదీ ఎంతో ఉత్తమమైన రోజు. ఎందుకు.. ఆ స్పెషల్ ఏంటి..? అనేది కొన్ని రోజుల్లో మీతో షేర్ చేసుకుంటాను. అప్పటివరకు కొన్ని కారణాలతో నేను సోషల్ మీడియా అయిన ట్విట్టర్ కు దూరంగా ఉండాలనుకుంటున్నాను అని ట్వీట్ చేశారు.

Share post:

Latest