సల్మాన్ ఖాన్-ఐశ్వర్యారాయ్ వివాహం ఆగిపోవడానికి కారణం అతనేనా..?

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కండల వీరుడు హీరో సల్మాన్ ఖాన్ అలాగే మిస్ వరల్డ్ గా గుర్తింపు పొందిన ఐశ్వర్య రాయ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. వీరిద్దరూ కూడా సినిమాలలో పోటీపడి మరి మంచి ప్రేక్షకాదరణ పొందారు.. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో ప్రేమించుకొని పెళ్లి చేసుకునే వారు కొందరైతే, ప్రేమించుకుని ఆ తర్వాత ఏదో ఒక కారణం చేత దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక అలాంటి వారిలో సల్మాన్ ఖాన్ , ఐశ్వర్యారాయ్ కూడా ఒకరు.. అంతా సవ్యంగా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి ఉంటే, అమితాబ్ బచ్చన్ కోడలు కాస్తా సల్మాన్ ఖాన్ భార్య అయ్యుండేది.. అయితే సల్మాన్ ఖాన్ తన ప్రేమను విఫలం చేసుకోవడానికి కారణం ఆయనే నట.

Shocking throwback: 10 reasons why Aishwarya Rai broke up with Salman Khan

సల్మాన్ ఖాన్ వల్లే తను ఐశ్వర్యకు దూరం అయ్యాడు అని ఆయన స్నేహితులు చెబుతూ ఉంటారు. కారణం ఏమిటంటే సల్మాన్ ఖాన్ సోనీ ఆలీ అనే అమ్మాయిని అప్పటికే ప్రేమించాడు. కానీ హమ్ దిల్ దే , చుకే సనం వంటి సినిమాలు చేస్తున్నప్పుడు హీరోయిన్ కోసం డైరెక్టర్ సంజయ్ లీలా కు ఐశ్వర్యరాయ్ ని తీసుకోమని సలహా ఇచ్చాడు. సంజయ్ లీలా కి కూడా ఐశ్వర్యరాయ్ నచ్చడంతో షూటింగ్ కి ఒప్పుకున్నారు.. ఇక షూటింగ్ అయిపోయే లోపు ఇద్దరు ప్రేమలో పడినట్లు సమాచారం..

Did Aishwarya Rai destroy Salman Khan's life? Here's what brother Sohail  Khan had said

ఇక విషయం తెలుసుకున్న సోనీ ఆలి, సల్మాన్ ఖాన్ మీద కోపంతో అమెరికా వెళ్లిపోయింది. ఇక ఇదే సమయంలో ఐశ్వర్యారాయ్, సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ కి కూడా బాగా దగ్గరైంది.. కానీ ఐశ్వర్యారాయ్, సల్మాన్ ఖాన్ ను ప్రేమించడం ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో ఇంట్లో మనస్పర్ధలు రావడం ,ఆమె అపార్ట్మెంట్ తీసుకొని జీవించడం మొదలు పెట్టింది. అయితే సల్మాన్ ఖాన్ , ఐశ్వర్య రాయ్ ని పెళ్లి చేసుకోవాలని, ఎన్నోసార్లు అడిగాడట .కానీ అప్పుడప్పుడే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమయంలో వివాహం వద్దని ఆమె చెప్పింది..

Aishwarya Rai Bachchan joins Salman Khan's ex talent agency

ఇక భరించలేక ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ కు అర్ధరాత్రి సమయంలో వెళ్లి తలుపులు కొట్టాడు. అయితే ఐశ్వర్య రాయ్ తలుపులు తీయలేదు.. తీయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని సల్మాన్ ఖాన్ బెదిరించాడట.. ఈ విషయం తెలుసుకున్న ఐశ్వర్యారాయ్ తండ్రి సల్మాన్ ఖాన్ పై కేసు పెట్టాడు.. దీంతో ఐశ్వర్యారాయ్ ను సల్మాన్ ఖాన్ వదిలేశాడు.