రైజ్ ఆఫ్ శ్యామ్ ప్రోమో ఎలా ఉందంటే.. నాని అదరగొట్టేశాడుగా?

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది.నవంబర్ 6న ‘శ్యామ్ సింగ రాయ్’ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోందని తెలియజేస్తూ ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ అంటూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ను విదుదల చేశారు.

ఈ రోజు శ్యామ్ సింగ రాయ్ ఈ పాటను సంబంధించిన ప్రేమ వచ్చింది. ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాట ప్రోమో లో హీరో నాని సంప్రదాయ బెంగాలీ గెటప్ లో నోట్లో సిగరెట్ పెట్టుకుని, పెద్ద కళ్ళద్దాలతో కనిపిస్తున్నాడు.

https://youtu.be/ZuQuOSPO51M

ఈ పాట శ్యామ్ పాత్రకు సంబంధించి క్యారెక్టరైజేషన్ గురించి వివరిస్తూ సాగుతుంది. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించారు. సినిమా ఈ సినిమా క్రిస్మస్ కానుకగా తెలుగు,తమిళం,కన్నడ,మలయాళ భాషల్లో డిసెంబర్ 24 న విడుదల కానుంది.