టైగర్ నాగేశ్వర రావు ల్యాండ్ అవుతున్నాడోచ్!

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు రమేష్ వర్మ డైరెక్షన్‌లో ‘ఖిలాడి’ అనే యాక్షన్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన ఈ హీరో.. తన నెక్ట్స్ మూవీగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే మెజారిటీ శాతం తెరకెక్కినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో రవితేజ ఓ ప్రభుత్వ అధికారిగా పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే ఈ సినిమాలతో పాటు తన నెక్ట్స్ ప్రాజెక్టులను కూడా వరుసబెట్టి ఓకే చేస్తూ ఫుల్ స్పీడు మీదున్నాడు. కాగా ఈ క్రమంలో ఇటీవల ధమాకా అనే సినిమాను కూడా అనౌన్స్ చేసిన రవితేజ, తన కెరీర్‌లో 70వ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక ఇన్ని సినిమాలను లైన్‌లో పెట్టిన రవితేజ, ఇప్పుడు మరో ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. స్టూవర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితగాధ ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ టైటిల్ పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు వంశీకృష్ణ తరకెక్కిస్తుండగా, ఈ సినిమా కోసం రవితేజ ఓ సరికొత్త లుక్‌లో మనకు కనిపించనున్నాడు. మరి రామారావు ఆన్ డ్యూటీ నుండి టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ ఎలాంటి వేరియేషన్స్ ఉన్న కథలతో మనముందుకు వస్తాడో తెలియాలంటే ఈ సినిమాలు రిలీజ్ అయ్యే వరకు మనం వెయిట్ చేయక తప్పదు.