పుష్పక విమానం..ఫస్ట్ డే కలెక్షన్ ఎన్ని కోట్లు అంటే..!

విజయ్ దేవరకొండ తమ్ముడు, ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం పుష్పకవిమానం. నిన్నటి రోజున ఈ సినిమా విడుదల అయ్యి యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్ కు విశేష స్పందన లభించడం గమనార్హం. ఈ సినిమాకు డైరెక్టర్ దామోదర్ దర్శకత్వం వహించాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద తన సత్తా చూపలేకపోయింది.

ఇక ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్ల విషయానికి వస్తే..

1). నైజాం- రూ.13 లక్షలు.
2). సీడెడ్- రూ.9 లక్షలు.
ఆంధ్రప్రదేశ్ మొత్తం కలెక్షన్లు విషయానికొస్తే.. రూ.14 లక్షలు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.36 లక్షలు.
ప్రపంచవ్యాప్తంగా 45 లక్షల రూపాయలను వసూలు చేసింది.

ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే… రూ.2.2 కోట్లు జరగగా.. ఈ చిత్రం మొదటి రోజే 45 లక్షల రూపాయలను రాబట్టింది. ఇక ఈ సినిమా సక్సెస్ కావాలంటే ఇంకా 1.75 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంటుంది.

Share post:

Latest