బ్రిట్నీ స్పియర్స్ భావోద్వేగం.. ఎందుకంటే?

గత 13 ఏళ్లుగా ప్రతిరోజు తన తండ్రి కారణంగా నరకం అంటే ఏంటో చూస్తున్న ప్రముఖ పాప్ సింగర్ అయినా బ్రిట్నీ స్పియర్ ఎట్టకేలకు తన తండ్రి చర నుంచి విముక్తి పొందింది. 2008లో బ్రిట్నీ స్పియర్స్ సంరక్షణ బాధ్యతను తన తండ్రి జెమిని స్పీయర్స్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన తండ్రి ఆమె కెరీర్ ని నాశనం చేశాడని, తన తండ్రి నుంచి తనకు విముక్తి కలిగించాలని ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తాజాగా నవంబర్ 12న ఈ కేసును విచారించిన లాస్ఏంజిల్స్ కోర్టు ఆమెకు ఊరటనిచ్చింది.

తన తండ్రి నుంచి తనకు ఊరట కలిగిస్తున్నట్లు కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన జీవితంలో ఇదే అత్యుత్తమైన రోజు అంటూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యింది. దీనితో ఆమెకు మద్దతు తెలపడానికి ఆమె ఫ్యాన్స్ లాస్ఏంజిల్స్ కోర్టుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు.బ్రిట్నీ స్పియర్స్ తండ్రి సంరక్షణలో భౌతికంగా, ఎమోషనల్ గా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోయినట్లు ఆమె తరపు లాయర్లు కోట్లు వాదించడం జరిగింది. వారి వాదనలు విన్న లాస్ఏంజిల్స్ కోర్టు ఆమెకు ఊరటనిస్తూ తీర్పును వెలువరించింది.