పెద్దన్న సినిమా..ఫస్ట్ డే కలెక్షన్స్..ఇంతేనా..!

Nసౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నయనతార హీరోయిన్ గా నటించిన చిత్రం పెద్దన్న. ఈ సినిమాలో హీరోయిన్ కుష్బూ, మీనా కూడా కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కలెక్షన్ల విషయంలో మాత్రం అంతగా ఆకట్టుకోలేదు అని చెప్పుకోవాలి.. కలెక్షన్ల విషయానికి వస్తే..

1). నైజాం-53 లక్షలు.
2). సీడెడ్-24 లక్షలు.
3). ఉత్తరాంధ్ర-16 లక్షలు.
4). ఈస్ట్-12 లక్షలు.
5). వెస్ట్-9 లక్షలు.
6). కృష్ణ-13 లక్షలు.
7). గుంటూరు-25 లక్షలు.
8). నెల్లూరు-11 లక్షలు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకొని..1.63 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది.

ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే..12.2 కోట్ల రూపాయలు జరగ్గా.. ఇప్పటివరకు పెద్దన్న సినిమా కేవలం..1.63 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది. ఈ సినిమా సక్సెస్ కావాలంటే 10.87 కోట్ల రూపాయలు రబట్టాల్సి ఉంటుంది. మరి అంతటి కలెక్షన్ రాబడుతుంది లేదు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.