మరోసారి తన గొప్పతనాన్ని నిరూపించుకున్న బాలకృష్ణ..!

హీరో నరసింహ బాలకృష్ణ తన విశాల హృదయాన్ని మరొకసారి చాటుకున్నాడు. ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే అడగ్గానే సహాయం చేస్తారు బాలకృష్ణ  ‘అన్‌స్టాపబుల్’ అనే షో చేస్తోన్న సంగతి తెలిసిందే.. ఈ షోలో ఫస్ట్ ఎపిసోడ్ లో అజిత్ అనే కుర్రాడు తన సోదరి బేగం బ్రెయిన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అతను చదువు మానేసి పని చేస్తున్నాడు అనే విషయాన్ని బాలకృష్ణ చెవిన పడింది.

ఇక దాంతో ఆ కుర్రోడు తన అక్కను బతికించుకునే కూలి పని చేయడం బాలయ్యను బాగా కదిలించింది దాంతో బాలకృష్ణ తన బసవతారకం ఆస్పత్రిలో అజిత్ సోదరులకు ఉచితంగా వైద్యం అందిస్తానని మాట కూడా ఇచ్చాడట.తాజాగా బాలకృష్ణ ఆ మాటను నిలబెట్టుకున్నారట. అజిత్ సోదరి బేగం బ్రెయిన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ను మొదలుపెట్టాలి హాస్పిటల్ సిబ్బంది.

ఎప్పటి నుండి బాలయ్య బాబు తన బసవతారకం చారిటబుల్ ట్రస్ట్ నుండి ఎందరో క్యాన్సర్ రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. బాలకృష్ణ అభిమానులు మాత్రం బాలయ్య చేసిన ఈ పనికి ఎంతో ఆనందం చేస్తున్నారు.