బిగ్ బాస్ షో పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవిలత?

సినీ నటి మాధవి లత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తరచు ఏదో ఒక విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ షో పై సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ హౌస్ లోని పరిస్థితులపై,అలాగే పోస్ట్ నాగార్జున పై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లో అనాగరిక చర్య లు జరుగుతున్నాయని, ఒక మనిషి సూసైడ్ చేసుకుని స్థాయిలో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అవమానించారని ఆమె ఆరోపించింది.ఇలాంటి వాటిపై అలాగే మానవ హక్కులు ప్రజా సంఘాలు స్పందించవు అని చెబుతూ ఏకి పారేసింది. అంతేకాకుండా అదే పని నాగార్జున కు జరిగితే ఎలా ఉంటుంది? ఒకవేళ అలా చేస్తే మరుసటిరోజు 100 శాతం గాయబ్ అవుతాడు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

అప్పట్లో తప్పుచేస్తే సగం మీసం లేదా అర గుండు కొట్టించి సున్నం రాసి గాడిద మీద ఊరేగింపు లాంటివి చేసేవారు. కలిగిన వ్యక్తులు అవమానభారంతో ఆత్మహత్య చేసుకునేవారు. ఇలాంటి కట్టిన విష సంస్కృతి వద్దు అని, మనుషులం మనం రాళ్ళలా ఉండొద్దు అని మనల్ని మనం మార్చుకుంటూ వచ్చాం. ఇక బిగ్ బాస్ టీం లో ఇప్పటికీ అలాంటి విషపు ఆలోచనలతో ఉన్నవారిని టీం గా తీసుకోవడం, సైకో మనస్తత్వం ఉన్నవారికి రచన అవకాశం ఇవ్వడం అనేది ఎంత దుర్మార్గం. ఇలాంటి షో నీ పద్ధతి లేకుండా అనాగరికపు వ్యవస్థకి పట్టం కడుతున్న యాజమాన్యం మరియు హోస్ట్ కి నూరు కోట్ల జరిమానా వేయిస్తాను అంటూ ఆమె తీవ్రస్థాయిలో మండిపడింది.

Share post:

Latest