కొరటాల ఈసారి తారక్‌ను పూర్తిగా వాడేస్తున్నాడుగా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో తన నట విశ్వరూపాన్ని చూపించనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇక కొమురం భీం పాత్రలో తారక్ నటనకు ప్రేక్షకులు ఫిదా కావడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. కాగా ఈ సినిమాలో తారక్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని ఓకే చేసిన సంగతి తెలిసిందే.

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ తన 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేశాడు. గతంలో కొరటాలతో కలిసి జనతా గ్యారేజ్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రంలో తారక్ నటించడంతో, ఈసారి అంతకు మించిన కథను తారక్ కోసం కొరటాల రెడీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో తారక్‌ను కొరటాల పూర్తిగా వాడుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తారక్ ఫుల్ లెంగ్త్ యాంగ్రీ ఎమోషన్‌ను కొరటాల వాడుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపైనే సినిమా కథను తీర్చిదిద్దుతాడట ఈ డైరెక్టర్.

తారక్ లోని యాంగ్రీ ఎమోషన్స్‌ను కథకు అనుగుణంగా మాత్రమే ఇప్పటివరకు డైరెక్టర్స్ వాడుకున్నారు. కానీ ఫుల్ లెంగ్త్‌లో యాంగ్రీ ఎమోషన్స్‌ను వాడుకోవడం అంటే కొరటాల ఈసారి ఎలాంటి కంటెంట్‌తో రాబోతున్నాడా అనే సందేహం అందరిలో నెలకొంది. ఏదేమైనా తారక్‌లోని ఈ యాంగిల్‌ను కొరటాల పూర్తిగా వాడాలని చూడటంతో ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో తెగ చర్చ సాగుతోంది.