జనసేన నుండి పోటీ చేస్తాను అంటున్న పొట్టి రియాజ్..!!

అదిరింది కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన కమెడియన్ పొట్టి రియాజ్ గురించి అందరికీ పరిచయమే. సద్దామ్ గ్రూపులో ఒకడిగా తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న రియాజ్ ప్రస్తుతం అదిరింది షో నిలిపివేయడంతో యూట్యూబ్ లో కొన్ని వెబ్ సీరీస్ లో నటిస్తూ ప్రేక్షకులకు ఎప్పుడూ చేరువలోనే ఉంటున్నాడు.. ఇకపోతే జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తానని చెబుతున్నాడు రియాజ్.. అదేంటో పూర్తి విషయాలు తెలుసుకుందాం..

నెల్లూరులోని 30వ డివిజన్ నుంచి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తానని కమెడియన్ రియాజ్ ప్రకటించారు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. త్వరలోనే వీటి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ ఎలక్షన్స్ లో జనసేన కూడా పోటీ చేయబోతుంది. దీంతో ఈసారి నెల్లూరు కార్పొరేషన్ లో జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో నెల్లూరు 30వ డివిజన్ నుంచి రియాజ్ పోటీ చేస్తున్నట్టు సమాచారం.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి రియాజ్ ని చూసయినా.. జనసేనకు సపోర్ట్ చేసే సెలబ్రిటీలు..జనసేన పార్టీ లో జాయిన్ అవుతారో లేదో చూడాలి.

Share post:

Latest