హాలీవుడ్ వైపు చూస్తున్న సమంత.. కారణం..?

సాధారణంగా టాలీవుడ్ హీరోయిన్లు బాలీవుడ్ కి ట్రై చేస్తూ ఉంటారు.. కానీ సమంత మాత్రం ఏకంగా హాలీవుడ్ లోకి అడుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తోంది. సమంత తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు , తమిళ సినిమాలకు వరుసపెట్టి సంతకాలు చేస్తోంది. శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత మరో రెండు తెలుగు, తమిళ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపోతే విడాకులకు ముందు ఈమె నటించిన ఫ్యామిలీ మెన్ టు వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తాజాగా హాలీవుడ్ లో ఒక నవల ఆధారంగా తెరకెక్కబోతున్న సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్న ఒక ఇంగ్లీష్ సినిమాలో సమంత మెయిన్ రోల్ చేయబోతున్నట్లు సమాచారం.. ఇండియన్ రైటర్ టైమెరి ఎన్. మురారి అరేంజ్ మెంట్ ఆఫ్ లవ్ అనే నవలను రాయడం జరిగింది. అయితే ఈ నవలను బ్రిటీష్ – శ్రీలంక నటి నిమ్మి హర్ స్గామా పబ్లిష్ చేయడం జరిగింది. 2004లో విడుదలైన ఈ నవల అప్పట్లోనే అత్యధికంగా అమ్ముడైంది.. అంతేకాదు టొరంటో ఇంటర్నేషనల్ ఫైనాన్సింగ్ ఫోరంకి కూడా ఈ నవల ఎంపిక కావడం గమనార్హం.

ఇకపోతే తాజాగా ఈ నవలని సినిమాగా తెరకెక్కిస్తున్నారు.. దీనిని ఫిలిప్ జాన్ అనే హాలీవుడ్ దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు ఓ బేబీ సినిమా నిర్మాతలు గురు ఫిలిమ్స్ వాళ్ళు తెరకెక్కిస్తున్నారు.. కాబట్టి వాళ్ళతో సమంతకు మంచి అనుబంధం ఉండటం కారణంచేత ,ఇందులో మెయిన్ లీడ్ రోల్ చేయమని అడిగినట్లు సమాచారం.ఇదే జరిగితే సమంత రేంజ్ మారిపోయినట్టు అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

Share post:

Latest