ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన బాలయ్య 107 వ చిత్రం..!!

November 13, 2021 at 2:01 pm

ప్రముఖ టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ తన 107 వ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాదులో ఘనంగా జరిగాయి.. ఈ వేడుకకు బాలయ్యతో పాటు దర్శకుడు గోపీచంద్ మలినేని, మొత్తం చిత్ర యూనిట్ హాజరవడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ 2022 జనవరి నుంచి ప్రారంభం కాబోతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ నటించబోతోంది.

ఇక యదార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందిన ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ మూవీ ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో కొంత భాగాన్ని అమెరికాలో చిత్రీకరించనున్నారు. గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రానికి తాత్కాలికంగా జై బాలయ్య అనే టైటిల్ ఖరారు చేయగా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక వచ్చే సంవత్సరం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన బాలయ్య 107 వ చిత్రం..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts