ఫ్రెండ్ బర్త్ డే పార్టీ లో సింపుల్ డ్రెస్ తో మెరిసిన సమంత..!!

సినీ ఇండస్ట్రీ లో ఉండే ఏ సెలబ్రిటీ అయినా సరే ఎలాంటి దుస్తులు వేసుకున్నా చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా అక్కినేని సమంత కూడా తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీ కి చాలా సింపుల్ డ్రెస్ తో హాజరయ్యింది. అయినా కూడా ఆమె ఆ పార్టీలో అట్రాక్టివ్ గా నిలవడం గమనార్హం.ఇటీవల ఓ బేబీ దర్శకురాలు నందిని రెడ్డి అలాగే ఇతర సన్నిహితులతో కలిసి పార్టీలో కనిపించింది అక్కినేని సమంత. అయితే ప్రముఖ డిజైనర్.. డిజైనర్ జోనాథన్ సింఖాయ్ రూపొందించిన నేవీ మరియు తెల్లటి చారల దుస్తులలో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

సమంతకు అత్యంత సన్నిహితురాలైన డాక్టర్ మంజుల అనగాని పుట్టినరోజు వేడుకకు నందిని రెడ్డి తో కలిసి సమంత హాజరయ్యారు. అంతేకాదు సమంత తన ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా డాక్టర్ మంజుల అనగాని కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. తన మనసులో ఉన్న భావాలను పంచుకుంది. నీలాంటి నిజమైన ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం.. కష్టాల్లో మాత్రమే నిజమైన ఫ్రెండ్స్ ఎవరో తెలుస్తారు.. నువ్వు నాకు దేవుడిచ్చిన గొప్ప స్నేహితురాలివి.. మరొక్కసారి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది సమంత. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారింది.

https://www.instagram.com/p/CWAEwt1hn1M/?utm_source=ig_web_copy_link

Share post:

Latest