బోయపాటి శీను..వీరందరి జాతకాలు మారుస్తాడా..!

స్టార్ డైరెక్టర్ బోయపాటి శీను తన సినిమాలలో హీరోలను ఎంత పవర్ఫుల్ గా చూపిస్తాడో, అంతే పవర్ఫుల్ గా విలన్లను కూడా చూపిస్తూ ఉంటాడు. అలా ఒక్కసారిగా లెజెండ్ సినిమాతో జగపతి బాబు కెరీర్ నే మార్చేశాడు. అయితే ఇప్పుడు తాజాగా అఖండ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాతో బోయపాటి శీను.. శ్రీకాంత్ కెరీర్ ని మలుపు తిప్పుతాడు అన్నట్లుగా శ్రీకాంత్ అభిమానులు భావిస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ లో భయంకరమైన లుక్ లో కనిపించిన శ్రీకాంత్ ను చూసి ఆయన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక అంతే కాకుండా బాలకృష్ణ కూడా వరస సినిమాల ప్లాప్ లోనే ఉన్నాడు. ఇక హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ కూడా వరుస ఫ్లాపులలోనే ఉన్నది. బోయపాటి శీను వీరందరి జాతకాలను మారుస్తారా అన్నట్లుగా అభిమానులు ఎంతగానో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఏదిఏమైనా ట్రైలర్ లో బాలయ్య లుక్ చూస్తే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకునేలా కనిపిస్తోంది. మనం కూడా ఈ సినిమాని సక్సెస్ కావాలని కోరుకుందాం.