బిగ్ అప్డేట్:బాలకృష్ణ అఖండ మూవీ టైటిల్ సాంగ్ ప్రోమో..వీడియో వైరల్..?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా అఖండ. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు అలాగే అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుంచి తాజాగా విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భం భం అఖండ అంటూ వచ్చే ఈ టైటిల్ సాంగ్ లో నుదిటిన విభూతి రాసుకుంటూ బాలకృష్ణ ఒక భోలా శంకరుడులా మనకు కనిపిస్తున్నాడు.

చేతిలో త్రిశూలం పట్టుకుని ఆయన నడిచే గంభీరమైన నడక ప్రతి ఒక్కరిని బాగా ఆకట్టుకుంటున్నాయి.. ఈ సినిమా చూసిన వారెవరైనా సరే నటసింహం మళ్లీ నిరూపించుకున్నాడు అనేలా ఈ సినిమాలో బాలకృష్ణ నటించాడు.. ప్రస్తుతం టైటిల్ సాంగ్ కు సంబంధించిన ప్రోమో ను మేకర్స్ విడుదల చేయగా అతి తక్కువ సమయంలోనే మంచి స్పందన లభిస్తోంది. కేవలం పది నిమిషాల ముందు విడుదల చేసిన ఈ ప్రోమో ఏకంగా యూట్యూబ్లో 10000 వ్యూస్ నమోదు చేసుకోవడం గమనార్హం.

Share post:

Popular