న‌ట్రాజ్‌ మాస్టర్ ఇంట సంబ‌రాలు..ఇన్‌స్టా పోస్ట్ వైర‌ల్‌!

ప్ర‌ముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫ‌ర్ న‌ట్రాజ్ మాస్ట‌ర్ ఇంట సంబ‌రాలు నెల‌కొన్నాయి. ఆయ‌న భార్య నీతూ తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో నటరాజ్‌ మాస్టర్ రెండో సారి తండ్రి అయ్యారు. పైగా కోరుకున్నట్లే ఆడపిల్ల పుట్ట‌డంతో.. ఆయ‌న ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

Nataraj Master: ఆడపిల్ల పుట్టింది.. నటరాజ్ మాస్టర్ కోరిక నెరవేరింది - Suman Tv

ఈ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేసిన న‌ట్రాజ్ మాస్ట‌ర్‌..అమ్మాయి పుట్టాలని నేను కోరుకుంటే.. అబ్బాయి పుట్టాలని మా ఆవిడ కోరుకుంది.. ఎవరు పుట్టినా మాకు ఓకే. కానీ, నా కోరిక‌ నెర‌వేరింది..ఆడపిల్లే పుట్టింది అంటూ ఎమోష‌న‌ల్ అయ్యాడు. అలాగే తన బిడ్డకు అందరి ఆశిస్సులు ఉండాలని కోరుకున్నారు.

Bigg Boss 5 Telugu Contestant Nataraj Master & Neethu Blessed With Baby Girl - Sakshi

దీంతో ఆయ‌న ఇన్‌స్టా పోస్ట్ కాస్త వైర‌ల్‌గా మారింది. ఇక నటరాజ్ మాస్టర్, నీతు దంపతులకు ఇంతకు ముందు ఒక పాప ఉంది. కాగా, తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్‌లో న‌ట్రాజ్ మాస్ట‌ర్ పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. భార్య నీతూ ఏడు నెల‌ల గ‌ర్బిణిగా ఉన్నప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన న‌ట్రాజ్ మాస్ట‌ర్‌.. నాలుగో వారం ఇంటి బాట ప‌ట్టాడు.

Nataraj master age height parents wife children biography - celebinto

అయితే హౌస్‌లో ఉన్నది కొద్ది రోజులే అయినా.. ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డంలో బాగానే స‌క్సెస్ అయ్యాడు. కానీ, స‌రైన ఫాలోయింగ్ లేక నాలుగో వారానికే ఎలిమినేట్ అయ్యాడు. ఇక హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక ఈయ‌న‌..ఆహాలో బాల‌య్య చేస్తున్న `అన్ స్టాప‌బుల్‌` షోకు కొరియోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించి ఆక‌ట్టుకున్నాడు.

https://www.instagram.com/tv/CWYvHAdDsOH/?utm_source=ig_web_copy_link

Share post:

Latest