బ్రహ్మానందంను చూసి షాక్ అయిన నెటిజన్స్.. వీడియో వైరల్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బ్రహ్మానందం పేరే. ఇక ఈయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాలలో తన అద్భుతమైన కామెడీ ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. కొన్ని సినిమాలు అయితే ఏకంగా బ్రహ్మానందం కామెడీ మీదే సూపర్ హిట్ అయ్యాయి.అయితే ఈ మధ్యకాలంలో బ్రహ్మానందం అనారోగ్య పరిస్థితుల వల్ల, సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.

తాజాగా హరీష్‌ వడత్యా దర్శకత్వంలో శ్రీకాంత్, సంగీత ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం తెలంగాణ దేవుడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ క్రమంలోనే ఇందులో బ్రహ్మానందం ఒక కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదలైన సందర్భంగా బ్రహ్మానందం సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.

ఈ వీడియోలో బ్రహ్మానందం మాటలు చూసి, అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. బ్రహ్మానందం అనారోగ్య కారణంగానే చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతని శరీరం మొత్తం వదులుగా మారిపోయి ఉండడంతో బ్రహ్మానందం చాలా మారిపోయారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest