ఆయనగారి కోసం వేచి చూడలేనంటున్న పూజ హెగ్డే..!

డైరెక్టర్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా భారీ డిజాస్టర్ ను చవిచూసింది. ఇక అలా మూడు సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత వరుస సినిమాలు ప్రకటించిన మొదలుపెట్టాడు. అయ్యప్పను కోషియమ్, భీమ్లా నాయక్, వంటి సినిమాలతో పాటు హరిహర వీరమల్లు సినిమాలలో కూడా నటిస్తున్నాడు.

అయితే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న భవదీయుడు భగత్ సింగ్. అనే టైటిల్ తో ఒక సినిమా ని నిర్మించబోతున్నట్లు గా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక లెక్చరర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎలా మారుతాడు అనే విషయంపై ఈ సినిమా కథ తెరకెక్కిస్తున్నారట.

ఇక ఈ సినిమాలో కథానాయికగా పూజాహెగ్డే నటించనుంది. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించాడు హరీష్ శంకర్. అయితే పవన్ పొలిటికల్ కారణాలవల్ల ఈ సినిమా షూటింగ్ చాలా లేట్ అవుతున్నట్లు గా సమాచారం. పూజా హెగ్డే కు డేట్స్ ఖాళీగా లేక పాలసీ తో బిజీగా ఉన్నది. ఇక పవన్ కళ్యాణ్ మొదలుపెడితే సరికి పూజ తన కాల్షీట్లు మేనేజ్ చేయగలుగుతుంది లేదా అనే విషయం ఇపుడు హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే పవన్ కళ్యాణ్ తో ఈమె నటించడానికి ఒప్పుకుంటుందా లేదా అనే విషయం తెలియాలంటే కొద్ది రోజులు ఉండాల్సిందే.