ఆనంద్ దేవరకొండ..నెల జీతం ఎన్ని లక్షలు తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఎంట్రీ ఇచ్చిన హీరోలు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ ఒకరు. మొదటిసారిగా దొరసాని సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత తన అన్న విజయ్ దేవరకొండ నిర్మాణం లో పుష్పక విమానం లో నటిస్తున్నాడు.

ఈ సినిమా నవంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుచేతనే ఈ సినిమా ప్రమోషన్ చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే ఇది ఇలా ఉండగా ఆనంద్ దేవరకొండ గురించి గూగుల్లో కొంతమంది నెటిజెన్స్ ప్రశ్నలు అడుగగా.. ఆనంద్ దేవరకొండ వారికి సమాధానాలను ఇస్తూ..మొదటిసారి ఉద్యోగం చేసినప్పుడు నెలకు 40 లక్షల జీతం తీసుకున్నట్లుగా తెలియజేశాడు.

అలాగే తనకు పాములంటే చాలా భయం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేశాడు. ఇక విజయ్ దేవరకొండ మొదటి సంపాదన వస్తే మొదటి సారి గా ఒక స్కూల్ పిల్లల నాటకంలో శిక్షణ ఇప్పించేందుకు తనకు నెలకు 35 వేలు జీతం ఇచ్చేవారని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ కూడా.