అల్లుఅర్జున్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కోట..!

సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కోటశ్రీనివాసరావు ఈ మధ్య కాలంలో సినిమాల్లో కంటే మీడియా లోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. మొన్నా ఆ మధ్య మెగా బ్రదర్ నాగబాబు పై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వార్తలు బాగా వైరల్గా మారాయి. అయితే తాజాగా అల్లు అర్జున్ పై కొన్ని వాక్యాలు కూడా చేశాడు కోట. అయితే అవి పాజిటివ్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

తాజాగా కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంతకుముందు మెగా ఫ్యామిలీ గురించి విమర్శించిన కోట ఇప్పుడు అల్లు అర్జున్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. అల్లు అర్జున్ నటన, అతడి డ్యాన్స్ స్పీడ్ గురించి కోట మాట్లాడడం జరిగింది. బన్నీ ప్రతి సినిమాకు సరికొత్త పవర్ తో కనిపిస్తూ ఉంటాడు అని చెప్పుకొచ్చాడు కోట. యూత్ లో అద్భుతమైన ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంటున్నాడని తెలియజేశాడు.

బన్నీ వర్క్ విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉంటూ కష్టపడుతూ ఉంటాడని చెప్పుకొచ్చాడు. తన తాత, మేనమామ తో పాటుగా స్టార్ డమ్ కంటిన్యూ చేస్తున్నాడు అని చెప్పుకొచ్చాడు కోట.

Share post:

Latest