అరుదైన ఘ‌న‌త సాధించిన త్రిష..వెల్లువెత్తుతున్న విషెస్‌!

త్రిష కృష్ణన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో కొన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా స‌త్తా చాటిన ఈ భామ‌.. మ‌ధ్య‌లో లాంగ్ గ్యాప్ తీసుకుని 96 సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈ మూవీ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో.. త్రిష్‌ మ‌ళ్లీ వ‌రుస సినిమాల‌తో బిజీగా మారింది.

Image

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ భామ అరుదైన ఘ‌న‌త సాధించింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) జారీ చేసే ‘గోల్డెన్‌ వీసా’ని ప్రముఖ నటి త్రిష అందుకున్నారు. దీంతో ఈ వీసా పొందిన తొలి తమిళ న‌టిగా త్రిష రికార్డు క్రియేట్ చేసింది.

Heroine Trisha : చిక్కుల్లో హీరోయిన్ త్రిష.. | Actress trisha in trouble over paramapadham vilayattu movie | TV9 Telugu

ఇక ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రక‌టించిన త్రిష..యూఏఈ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి నటిని తానే కావడం ఆనందంగా ఉందని పేర్కొంది. ఈ నేప‌థ్యంలోనే అభిమానులు మ‌రియు సినీ ప్ర‌ముఖు త్రిష‌కు విషెస్ తెలియ‌జేస్తున్నారు.

https://twitter.com/trishtrashers/status/1455887930338201610?s=20