అభిమాని కోరిక తీర్చిన మంచులక్ష్మి..షాక్ లో అభిమాని..?

సినిమా ఇండస్ట్రీలో మంచు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోహన్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి ఎంట్రీ ఇచ్చారు. వీరు పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా మంచులక్ష్మి సినిమాలలో నే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.

ఇక ఈ క్రమంలోనే ఎన్నో విషయాలను పంచుకుంటుంది మంచు లక్ష్మి. అయితే తాజాగా ఒక విషయాన్ని అభిమానులతో పంచుకుంది.”మనం భయాన్ని ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడే మన జీవితానికి హద్దులు ఉండవు.. అందుకే ప్రేమను ఎంచుకొని భయాన్ని పక్కన పెట్టాలని మంచు లక్ష్మి ఒక పోస్ట్ ద్వారా తెలియజేసింది.”

ఇక ఈ ట్వీట్ కు అభిమానులు పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు. ఇక ఒక అభిమాని అయితే అక్క మీరు అంటే చాలా ఇష్టం. ఈ రోజు నా పుట్టినరోజు నాకు విషెస్ చెప్పండి అని అడిగారు . అలా ఒక అభిమాని కోరడంతో మంచు లక్ష్మి “హ్యాపీ మోస్ట్ బర్తడే అంటూ”తన అభిమాని కోరిక తీరుస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలియజేసింది. దీంతో ఆ అభిమాని అడిగిన వెంటనే ఇలా చేయడంతో ఆశ్చర్యపోయాడు.

https://twitter.com/LakshmiManchu/status/1459037802931228674?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1459037802931228674%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugustop.com%2Fmanchu-lakshmi-wishes-his-fan-on-his-birthday-e0b085e0b0ade0b0bfe0b0aee0b0bee0b0a8e0b0bf