సంపూ `క్యాలీఫ్లవర్` ట్రైలర్ వ‌చ్చేసింది..ఎలా ఉందంటే?

‘హృదయ కాలేయం’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన టాలీవుడ్ బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం `క్యాలీఫ్ల‌వ‌ర్‌`. శీలో రక్షతి రక్షితః.. అన్నది ట్యాగ్ లైన్. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వాసంతి హీరోయిన్‌గా న‌టించ‌గా.. పోసాని కృష్ణమురళి, పృధ్వీ, ముక్కు అవినాష్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు.

అలాగే ఆశా జ్యోతి గోగినేని నిర్మించిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 26న విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్‌ షురూ చేసిన చిత్ర యూనిట్‌.. తాజాగా క్యాలీఫ్ల‌వ‌ర్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. శీలం ఆడాళ్లకే ముఖ్యమా ? మగాళ్ల శీలానికి కూడా విలువ ఉంటుందనే విభిన్న‌మైన‌ కాన్సెప్టుతో వినోదాత్మకంగా ఈ మూవీని రూపొందించారు.

జంతువుకైనా మనుషులకైనా ఒకే భార్య ఒకే భర్త అనే సిద్ధాంతంతో తన గ్రామ ప్రజల శీలాలను కాపాడే క్యాలీ ఫ్లవర్(సంపూ).. పెళ్లి తర్వాత తన శీలాన్నే పోగొట్టుకున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై క్యాలీ ఫ్లవర్ చేసిన పోరాటమే ఈ సినిమా అని ట్రైల‌ర్ బ‌ట్టీ స్ప‌ష్టంగా అర్థం అవుతోంది. అలాగే ట్రైలర్ లో పవర్ ఫుల్ డైలాగ్స్, తనదైన యాక్టింగ్ తో సంపూ ఆకట్టుకున్నాడు.

మొత్తానికి ఫుల్ కామెడీగా సాగిన ఈ ట్రైల‌ర్‌.. సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. మ‌రి ఈ సినిమా ఏ మేర‌కు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుందో తెలియాలంటే న‌వంబ‌ర్ 26 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.