యువ బంగార్రాజుగా నటించేది నాగ చైతన్యనా .. ఫస్ట్ లుక్ పోస్టర్ తో క్లారిటీ..!

November 22, 2021 at 7:59 pm

అక్కినేని నాగార్జున హీరోగా 2016లో విడుదలైన సోగ్గాడే చిన్నినాయనా సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సోగ్గాడే చిన్నినాయనా సినిమా విడుదలైన ఐదేళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కుతోంది. నిజానికి ఈ సినిమా సీక్వెల్ కాదని ప్రీక్వెల్ అని తెలుస్తోంది.

సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో కథ ఆరంభంలోనే బంగార్రాజు పాత్ర పోషించిన నాగార్జున క్యారెక్టర్ చనిపోయినట్లు చూపిస్తారు. అయితే ఆ తర్వాత తన కుటుంబానికి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి ఆత్మ రూపంలో నాగార్జున భూమి పైకి రావడం చూపిస్తారు. అయితే ఇప్పుడు తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమాలో బంగార్రాజు క్యారెక్టర్ ఎలా చనిపోయింది.. చూపిస్తారని తెలుస్తోంది.

అయితే ఈ క్యారెక్టర్ నాగార్జున కాకుండా నాగచైతన్య పోషిస్తున్నట్లు సమాచారం. మంగళవారం నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ బంగార్రాజు సినిమా మంచి నాగచైతన్య ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో నాగచైతన్యను బంగార్రాజుగా పరిచయం చేశారు. దీంతో ఈ సినిమాలో యువ బంగార్రాజు పాత్ర పోషించేది నాగచైతన్య అని అర్థమవుతోంది. ఇక యువ రమ్యకృష్ణ పాత్రలో కృతి శెట్టి కనిపించనుంది.

కాగా ఈ సినిమా టీజర్ రేపు ఉదయం 10:23 నిమిషాలకు విడుదల కానున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు. కాగా బంగార్రాజు సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. బంగార్రాజు సినిమాను జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

యువ బంగార్రాజుగా నటించేది నాగ చైతన్యనా .. ఫస్ట్ లుక్ పోస్టర్ తో క్లారిటీ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts