పెళ్లి కొడుకు అయిన హీరో కార్తికేయ‌..నెట్టింట ఫొటోలు వైర‌ల్‌!

టాలీవుడ్ యంగ్ అండ్ స్టైలిష్ హీరో కార్తికేయ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఆర్ఎక్స్ 100` సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ‌.. మ‌రి కొన్ని గంట్లోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే కార్తికేయ‌ లోహిత అనే అమ్మాయితో ప్రేమ వ్యవహారాన్ని న‌డిపించాడు. దాదాపు 11 ఏళ్ల నుంచీ ప్రేమించుకుంటున్న ఈ జంట ఎట్ట‌కేల‌కు పెద్ద‌ల‌ను ఒప్పించి ఒక‌టి కాబోతున్నారు.

నవంబర్‌ 21(ఆదివారం)న ఉదయం 9 గంటల 47 నిమిషాలకు అతి కొద్ది మంది బంధువులు, ఫ్రెండ్స్, సినీ ప్రముఖుల మధ్య ప్రేయ‌సి లోహిత మెడలో మూడు ముళ్ల వేయనున్నాడు కార్తికేయ. దీనికి సంబంధించిన శుభలేఖ ఇప్ప‌టికే సోషల్‌ మీడియాలో వైర‌ల్ అయింది. అయితే ఈ రోజు కార్తికేయ- లోహిత‌ల‌ను పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిగా ముస్తాబు చేశారు.

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మార‌గా.. మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్న ఈ జంట‌కు ప‌లువురు సెల‌బ్రెటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా విషెస్ తెలియ‌జేస్తున్నారు. కాగా, కార్తికేయ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఆర్ఎక్స్ 100 త‌ర్వాత హిప్పీ, గుణ 369, 90ఎంఎల్, చావు కబురు చల్లగా చిత్రాల్లో న‌టించారు. కానీ, అనూహ్యంగా ఈ చిత్రాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి.

ఇక వారం రోజుల క్రిత‌మే కార్తికేయ న‌టించిన‌ `రాజా విక్రమార్క` చిత్రం భారీ అంచ‌నాల మ‌ధ్య థియేట‌ర్స్‌లో విడుద‌లైంది. కొత్త దర్శకుడు శ్రీ సిరిపల్లి తెరకెక్కించిన ఈ మూవీ యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుని ఓ మాదిరి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. మ‌రోవైపు కార్తికేయ.. అజిత్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘వలిమై’ సినిమాతో విల‌న్‌గా న‌టించాడు. ఈ మూవీతో త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది.

Share post:

Latest