కైకాల సత్యనారాయణ సినీ ప్రస్థానం.. హీరో నుంచి విలన్ గా ఎదిగిన తీరు అద్భుతం

కైకాల సత్యనారాయణ.. తెలుగు సినీ ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని పేరు. నవరస నటనా సార్వభౌముడిగా, విలక్షణ నటుడిగా ఆయన సినీ ప్రస్థానాన్ని అందుకోవడం అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. అయితే.., కైకాల సత్యనారాయణ వయసు ప్రస్తుతం 88 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఈయన వృద్ధాప్య సామాజీలతో బాధపడుతున్నారు. ఇక తాజాగా కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో.. అభిమానులు షాక్ కి గురి అవుతున్నారు. ప్రస్తుతం కైకాల జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికలో చికిత్స అందుకుంటున్నారు. సత్యనారాయణకి ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ సినీ జ్ఞాపకాలను ప్రేక్షకులు గుర్తుకి తెచ్చుకుంటున్నారు.

సత్యనారాయణ సినీ ప్రస్థానం గురించి చెప్పుకోవాలంటే.. మూడు తరాల తెలుగు సినిమా గురించి చెప్పుకోవాలి. సీనియర్ యన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ కైకాల అందరితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. దాదాపు ఆరు దశాబ్దాల సినీ ప్రయాణంలో కైకాల దాదాపు 777 చిత్రాల్లో నటించారు. అన్నిటిలో భిన్న పాయాత్రలు ధరించి ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కైకాల సత్యనారాయణ…1935లో కృష్ణ జిల్లా బంటుమిల్లి గ్రామంలో జూలై 25న జన్మించారు. చిన్నతనంలోనే నాటకాల మీద ఆసక్తి ఏర్పడటంతో కైకాల చాలా నాటకాల్లో నటించి మెప్పించారు. డిఎల్ నారాయణ నిర్మించిన ‘సిపాయి కూతురు’ చిత్రం తెలుగుతెర పై కైకాల సత్యనారాయణ మొదటి చిత్రం. 1958లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ చిత్రం.. నటుడిగా కైకాలకి మంచి పేరు తెచ్చి పెట్టింది.

ఇక ఆహార్యం విషయంలో సత్యనారాయణలో ఎన్టీఆర్ పోలికలు ఉండటం ఆయనకి కలసి వచ్చింది. కైకాల చాలా చిత్రాల్లో యన్టీఆర్ కి డూప్ గా నటించారు. ఈ సమయంలోనే ఆయనకి పరిశ్రమలో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. తెలుగు తెర గర్వించే సినిమాల్లో ఒకటైన రాముడు భీముడు సినిమాలో యన్టీఆర్ కి డూప్ గా నటించింది కైకాలే. ఇక ప్రముఖ దర్శకుడు విఠలాచార్య సత్యనారాయణలోని విలనిజాన్ని వెలికితీశారు. విఠలాచార్య సినిమాలో సత్యనారాయణ మంచి బ్రేక్ ఇచ్చాయి.

‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో కర్ణుడిగా, ‘లవకుశ’లో భరతుడిగా, ‘నర్తనశాల’లో దుశ్శాసునుడిగా, ‘శ్రీకృష్ణపాండవీయం’లో ఘటోత్కచుడుగా, ‘దాన వీర శూర కర్ణ’లో భీముడిగా, ‘కురుక్షేత్రం’లో దుర్యోధనుడిగా, ‘సీతా కళ్యాణం’లో రావణుడిగా కైకాల నటనని ప్రేక్షకులు ఎన్నటికీ మరచిపోలేరు.

ఇక డైలాగ్ డిక్షన్‌లోనూ, హావభావాల్లోనూ, ఆకారంలోనూ సత్యనారాయణ జూనియర్ యస్వీఆర్ అనిపించుకున్నారు అంటే నటుడిగా అఆయన స్థాయి ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇక యన్టీఆర్ తో నటించిన యమగోల చిత్రం కైకాల కెరీర్ లో ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు. నిజంగా యముడు ఇలానే ఉంటాడు ఏమో అన్న రీతిలో కైకాల సత్యనారాయణ మెప్పించారు. ఆ తరువాత నుండి కైకాల యాముడి పాతలకి కేరాఫ్ అయ్యారు. ఇక సినిమాల్లో తనదైన మార్క్ ఏర్పరుచుకున్న కైకాల రాజకీయాల్లో కూడా రాణించారు. ఎన్టీఆర్ అండతో 1996లో మచిలీపట్నం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణతో స్నేహంగా మెలగడం ఒక్క కైకాలకి మాత్రమే సాధ్యం అయ్యింది. ఇక 2011లో ఏపీ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించడం విశేషం. మరి.. చూశారు కదా? కైకాల సత్యనారాయణ నట ప్రస్థానం. కైకాల ప్రస్థానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.