విడాకుల తీసుకున్న స్టార్ హీరో భార్య మరొకరితో..?

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసాన్ ఖాన్ వేరొకరితో రిలేషన్ లో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.2000 వ సంవత్సరంలో పెళ్లయిన వీరిద్దరూ దాదాపు 14 సంవత్సరాల పాటు తమ వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడిపారు.కానీ వీరి మధ్య వస్తున్న వివాదాలు తారాస్థాయికి చేరడంతో ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నారు . కానీ పిల్లల విషయంలో మాత్రం ఇద్దరు ఎప్పుడూ కలిసే ఉంటారు. వీళ్లు పెళ్లి బంధానికి గుడ్ బై చెప్పినప్పటికీ తమ పిల్లలతో కలిసి ఇద్దరూ ట్రిప్ కి వెళ్ళిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.Sussanne Khan के लिए रयूमर्ड बॉयफ्रेंड Arslan Goni हो गए रोमांटिक, बोले-  हैप्पी बर्थडे डार्लिंग...मिला ऐसा जवाब

అర్స్లన్ గోనీ అనే ఇండస్ట్రీ కి చెందిన నటుడితో సుసాన్ ఖాన్ రిలేషన్ లో ఉందనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి..సుసాన్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకి విషెస్ చెబుతూ.. హ్యాపీ బర్త్ డే డార్లింగ్ అంటూ మొదలుపెట్టి ముద్దులతో ముగించాడు. ఈ పోస్ట్ చూసిన సుసాన్ వెంటనే రియాక్ట్ అవుతూ.. ‘మై ఎవ్రిథింగ్’ అంటూ రిప్లై ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఫైనల్ గా ఓపెన్ అయ్యారు.. ఇప్పుడు పెళ్లి చేసుకోండి అంటూ సలహాలు ఇస్తున్నారు. అయితే వీరు నిజంగానే రిలేషన్ లో ఉన్నారా లేక స్నేహితుల అన్న విషయం మాత్రం తెలియలేదు.

https://www.instagram.com/p/CVeulqLIe0F/?utm_source=ig_web_copy_link