తలైవాకు అస్వస్థత.. ఆందోళనలో అభిమానులు..?

సూపర్ స్టార్ రజనీకాంత్ కు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాగా అనారోగ్యంగా ఉండటంతో నిన్నటి రోజున సాయంత్రం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. రజనీకాంత్ ఇప్పటికి కూడా ఆసుపత్రిలోనే ఉన్నాడు అన్నట్లుగా సమాచారం. అయితే ఆయన ఆరోగ్యం పై మరింత సమాచారం తెలుసుకోవాల్సి ఉందని అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇక తాజాగా రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా   ‘అన్నాత్తే’ తెలుగులో ఈ సినిమాని పెద్దన్నగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దీపావళి పండుగ కానుకగా నవంబర్ 4వ తేదిన ప్రేక్షకుల ముందుకు విడుదల చేయబోతున్నారు. మొన్నటి రోజున ఈ సినిమా ట్రైలర్ విడుదల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అయితే అభిమానులు కూడా ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి పెట్టుకున్నారు. కానీ రజనీకాంత్ ఇలా అస్వస్థత రావడంతో ఆయన అభిమానులు హాస్పిటల్ దగ్గరికి పెద్ద ఎత్తున తరలివచ్చారు

Share post:

Latest