కూజాంగల్ సినిమాకు ఆస్కార్ అవార్డ్?

ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డ్ ఆస్కార్. ఒక్కసారైనా ఈ అవార్డును సాధించాలి అనే ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్ కోరుకుంటూ ఉంటారు. ఇక ఈ అవార్డు కార్యక్రమం 2022 మార్చి లో లాస్ ఏంజెల్స్ లో జరగనుంది. ఇక ఈ ఆస్కార్ అవార్డు కి అంతర్జాతీయ చలనచిత్ర క్యాటగిరి తమిళ చిత్రం నుంచి కూజాంగల్ సినిమా ఎంపిక అయ్యింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15 మంది సభ్యుల జ్యూరి మన దేశం నుంచి నామినేషన్ కు వెళ్లే దగ్గర మొత్తం 14 సినిమాలోని వీక్షించింది.

- Advertisement -

ఈ 14 సినిమాలలో ఈ కూజాంగల్ సినిమాను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. పిఎస్ వినోద్ రాజ్ దర్శకుడిగా పరిచయం అయిన ఈ సినిమా రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై, టాలీవుడ్ హీరోయిన్ నయనతార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ నిర్మించారు.

ఈ సినిమా నిర్మాత విగ్నేష్ శివన్ విదేశీ ఉత్తమ మూవీ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ కు పోటీ పడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. అండ్ ది ఆస్కార్ గోస్ టు అనే పదం వినేందుకు మరొక రెండు అడుగుల దూరం లో ఉన్నాం ఎంతో ఆనందంగా ఉంది అంటూ తెలిపాడు.

Share post:

Popular