సమంత డివోర్స్.. బయటకు వచ్చిన అబార్షన్ ,సరోగసీ విషయాలు ఇవే..?

సమంత – నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించినప్పటికీ.. ఇంకా ఆరు నెలల గడువు ఉంది కాబట్టి ఈ లోపు కలిసి పోవాలనే నిర్ణయం కూడా తీసుకోవచ్చు అని పలువురు సినీ ఇండస్ట్రీ పెద్దలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి వీరిద్దరి మధ్య గొడవలు రావడానికి గల కారణం మాత్రం ఎవరికీ తెలియలేదు అని అనుకున్నాము.. కానీ ఎవరికి నచ్చినట్టుగా ఎవరికి తోచినట్టు వాళ్ళు తమ అభిప్రాయాలను ఇరువురి పై వ్యక్తపరిచారు.

ఇకపోతే సమంత డివోర్స్ తీసుకోవడానికి కారణం అక్కినేని ఫ్యామిలీ లో ఈమె కలవలేక పోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వచ్చిన సమాచారం ఏమిటంటే, సమంతకు పిల్లలు కనడం ఇష్టం లేదట . ఈ విషయంపై అక్కినేని ప్యామిలితో సమంతకు ప్రతి రోజూ గొడవలు వచ్చేవట. ఆమె ఒకసారి గర్భం దాల్చి అబార్షన్ కూడా చేయించుకుని , సరోగసీ ద్వారా పిల్లలను కంటానని వారితో వాదించినట్లు సమాచారం. సరోగసీ అంటే అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కనడం.. సాధారణంగా చాలా మంది పిల్లలను కనే అవకాశం లేని వాళ్ళు అద్దె గర్భం ద్వారా పిల్లలను కంటూ ఉంటారు.

నిజానికి చాలా మంది హీరోయిన్లు పిల్లల్ని కంటే అందం చెడిపోతుంది అన్న కారణంతో పిల్లల్ని కనడానికి ఇష్టపడడం లేదు.. అంతా కూడా సినిమాలలో నటించాలని, పిల్లల్ని కంటే అందం పోతుందని, గ్లామర్ తగ్గిపోతుందని, ఈ కారణం చేతనే ఆమె సరోగసీ ద్వారా పిల్లలను కంటానని చెప్పిందట. ఈ విషయంపై ప్రతిరోజు ఒకరికొకరు గొడవ పడుతుండడంతో విడిపోవడమే మంచిదని విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారు నాగచైతన్య- సమంత. కానీ ఇందులో సమంత తప్పే ఉందని తెలుస్తోంది కాబట్టి ,ఆమె అర్థం చేసుకొని అమ్మతనం అంటే అద్భుతం అని తెలుసుకుంటే చాలా చక్కగా ఉంటుందని అందరి అభిప్రాయం.