సమంతకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కోర్ట్..!

ప్రముఖ నటి సమంతకు కూకట్ పల్లి కోర్టులో ఊరట లభించింది. సమంత వ్యక్తిగత వివరాలను ఎవరు ప్రసారం చేయకూడదని ఆమె ఇప్పటికే యూట్యూబ్ ఛానల్స్ మీద కేసు వేసింది. దాంతో పాటే వీడియోలను కూడా తొలగించాలని కోర్టును ఆశ్రయించింది.

అయితే ఈ విషయంపై ఇండైరెక్టుగా కొన్ని కామెంట్లు చేసింది కోర్టు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడానికి మీరే ఛాన్స్ ఇస్తున్నారు అన్నట్లుగా పరోక్షంగా జడ్జి కామెంట్ చేశారు. అలాగే తను విడిపోతున్నాం అని ఈ విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ద్వారా అది కూడా పాయింట్ చేశారు జడ్జి.

ఇక వీరి వాదోపనలు విన్న తర్వాత మంగళవారం రోజున సుమన్ టీవి, తెలుగు పాపులర్ టీవీ, లో ఉండేటువంటి వీడియోస్ ను డిలీట్ చేయమని తెలిపింది. అలాగే వెంకట్రావు ప్రసారం చేసిన వీడియోలు కూడా తొలగించాలని కోర్టు ఆదేశాలు వెలువరించింది. ఏదిఏమైనా సమంతాకు కోరుతూ అనుకూలంగా తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు.