సమంతకు షాక్ ఇచ్చిన కోర్ట్..?

నాగచైతన్య తో విడాకులు వ్యవహారానికి సంబంధించి కొన్ని తప్పుడు ప్రచారాలు ఈ విషయంపై యూట్యూబ్ ఛానల్ పై మొన్నటి రోజున కేసు వేసిన సంగతి మనకు తెలిసిందే. తనకు వ్యక్తిగతంగా, వ్యక్తిత్వానికి భంగం కలిగేలా అబద్దాలను ప్రచారం చేశారని సదరు వ్యక్తుల పై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ ఆమె తన పిటిషన్లో తెలియజేసింది.

యూట్యూబ్ చానల్స్ తో పాటు డాక్టర్ వెంకటరావు ల పై కూడా పరువునష్టం దాక పిటిషన్ చేసింది. ఇక ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించడం కుదరదని కూకట్పల్లి కోర్టు స్పష్టం చేసింది. సమంత నటిగా బిజీగా ఉండడంతో ఆమె కోర్టును ఎమర్జెన్సీ ప్రతిపాదన ఇవ్వాలంటూ సమంత తరఫున న్యాయవాది బాలాజీ కోరడం జరిగింది.

దీంతో ఆ పిటిషన్ను విచారించాలని అన్న లాయర్ బాలాజీ పై కూకట్పల్లి కోర్ట్ జడ్జి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో చట్టం ముందు అందరూ సమానులే. కొందరి ఎక్కువ, ఇంకొందరు తక్కువ అనే భావన ఉండదు. మీ సమంత కేసును ప్రొసీజర్ ప్రకారం విచారిస్తామని తెలియజేశాడు. దీనిని పరువునష్టం కేసు మాదిరిగానే వాదనలు వింటాము తెలియజేశాడు. అత్యవసర కేసు గా మాత్రం పరిగణించాలేమని తెలియజేశాడు.