మ‌ళ్లీ అరెస్ట్ అయిన `శాక్రిఫైజ్ స్టార్‌’..ఈసారేం చేశాడంటే?

శాక్రిఫైజ్ స్టార్ అలియాస్ సునిషిత్ మ‌ళ్లీ అరెస్ట్ అయ్యాడు. పబ్లిసిటీ కోసం ఎప్పుడూ సినీ హీరోలు, హీరోయిన్లు, దర్శకులపై నోటికొచ్చిన‌ట్టు మాట్లాడుతూ వార్త‌ల్లో నిలుస్తుంటాడీయ‌న‌. ఫలానా సినిమాల్లో తానే హీరోగా చేయాల్సిందని, పలువురు హీరోయిన్లు తనని ప్రేమించారని, పెళ్లి పీటల వరకూ వెళ్లి వెనక్కి తగ్గారని.. ఇలా ఏవేవో సోదులు చెబుతూ బాగానే క్రేజ్ సంపాదించుకున్నాడు.

Sacrifice Star Sunishith | - Discussions - Andhrafriends.com

అయితే తాజాగా సోది స్టార్ మల్కాజిగిరి స్టేషన్‌లో పనిచేసే ఓ పోలీసు అధికారిపై తప్పుడు వీడియో త‌న యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసి.. అడ్డంగా బుక్కైపోయాడు. స‌ద‌రు పోలీసు అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి కీసర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం సునిషిత్‌ను అరెస్ట్ చేశారు.

Mahesh Babu, Jr NTR and Ravi Teja snatched these films; shocking allegations by Sriramoju Sunisith - IBTimes India

తప్పుడు వీడియో ఇచ్చినట్లు సునిషిత్ ఒప్పుకోవ‌డంతో.. అత‌డిని రిమాండ్‌కు తరలించినట్లు కీసర సీఐ నరేందర్‌గౌడ్‌ తెలిపారు. కాగా, గ‌తంలో సునిషిత్ ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో జైలుకెళ్లాడు. ఆ త‌ర్వాత ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కేసులోనూ అరెస్ట్ అవ్వ‌గా.. బెయిల్‌పై బయటికొచ్చాడు.

Share post:

Latest