పునీత్ రాజ్..చేసిన మంచి పనులు తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..?

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కొన్ని గంటల క్రితం మరణించడం జరిగింది. ఆయన మరణంతో తెలుగు ఇండస్ట్రీ చలించి పోయింది. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక మన టాలీవుడ్ నటులు కూడా తమ మనోభావాలను వ్యక్తం చేశారు. ఒకానొక సందర్భంలో ఇండియాలో ఒకరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేను కాదండి అని కూడా తెలియజేశాడు.

ఇక పునీత్ రాజ్ సైమా అవార్డ్స్ తీసుకున్న సందర్భంగా ఆరోజు అందాల నటి శ్రీదేవి కి , చిరంజీవి కి పాదాభివందనం కూడా చేశారు.. ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొని మనసున్న మనిషిగా నిరూపించుకున్నారు పునీత్ రాజ్ కుమార్.. ఏకంగా 45 పాఠశాలలను , 25 అనాధాశ్రమాలు, 16 వృద్ధాశ్రమాల, 19 గోశాలల తోపాటు 1800 మంది విద్యార్థులను దత్తత తీసుకున్నారు. అంతేకాదు చనిపోయిన తర్వాత తన కళ్ళను కూడా దానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఇలా ఎన్నో చేసినా, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి.. ఎంతోమందిని ఆదుకున్న ఈ గొప్ప మహానటుడు మరణించడంతో మొత్తం దేశమే నేడు శోకసంద్రంలో మునిగిపోయింది.

Share post:

Popular