పునీత్ రాజ్‌కుమార్‌ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా..?

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ అక్టోబర్‌ 29న గుండె పోటుతో క‌న్నుమూసిన‌ సంగ‌తి తెలిసిందే. ఆయ‌న అంత్యక్రియలు ఈ ఉదయం పూర్తయ్యాయి. బెంగుళూరులోని కంఠీరవ స్టూడియోలో ల‌క్ష‌లాది మంది అభిమానులు.. కుటుంబసభ్యులు.. సన్నిహితుల మధ్య ప్రభుత్వ లాంఛానాలతో పునీత్‏కు కడసారి వీడ్కోలు తెలిపారు.

Puneeth Rajkumar: Film fraternity, fans pay tribute to Power Star

ఇక పునీత్ లేర‌న్న విష‌యాన్ని జీర్ణించుకుంటూ.. ఆయ‌న గురించి కొన్ని విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. లెజెండరీ నటుడు కంఠీరవ రాజ్‌కుమార్‌ మూడవ కొడుకే పునీత్‌ రాజ్‌కుమార్‌. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని బాలనటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన పునీత్‌.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక సామ్రాజ్యానే ఏర్ప‌ర్చుకున్నారు.

The Puneeth Rajkumar and Ashwini Revanth love story - Movies News

ఇక కెరీర్‌లో దాదాపుగా 30 చిత్రాల్లో న‌టించిన పునీత్‌.. త‌న ఫ్యామిలీ కోసం ఆస్తుల‌ను సైతం బాగానే కూడ‌బెట్టారు. అవును, కన్నడ సినీ పరిశ్రమలో సంపన్నమైన హీరోల్లో ఆయన ఒక‌రు. ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. పునీత్ ఆస్టుల విలువ‌ 35 నుంచి 45 కోట్ల వరకు ఉంటుంద‌ట‌. అలాగే తండ్రి నుంచి కూడా పునీత్‌కు భారీగానే ఆస్తులు వ‌చ్చాయ‌ని.. అవ‌న్నీ క‌లిపి యాబై కోట్ల వ‌ర‌కు ఆయ‌న ఆస్తుల విలువ ఉండొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. కాగా, 1999లో అశ్వనీ రేవంత్‌ అనే అమ్మాయిని పునీత్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ధ్రితి, వందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ಸಣ್ಣ ವಯಸ್ಸಲ್ಲೇ ಸಮಾಜ ಸೇವೆಯಲ್ಲಿ ತೊಡಗಿಸಿಕೊಂಡ ಪುನೀತ್ ಮಗಳು ದೃತಿ... | Kannada actor puneeth rajkumar daughter druthi photo gallery