యంగ్ హీరో క్వశ్చన్ కి సరదాగా కౌంటర్ ఇచ్చిన సన్నీ సింగ్?

టెక్నాలజీ డెవలప్ అవడంతో ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఈ ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా కూడా ఇట్టే తెలిసిపోతుంది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ద్వారా సినీ సెలబ్రిటీల కు, అలాగే అభిమానులకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించింది అని చెప్పవచ్చు. సెలబ్రిటీలు తమ కు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక తాజాగా హీరో ప్రభాస్ తన సహ నటుడు సన్నీ సింగ్ కు సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

అయితే నిజానికి ఈ సన్నీ సింగ్ బర్తడే అక్టోబర్ 6 అయితే ప్రభాస్ మాత్రం ఒక రోజు ముందుగానే అక్టోబర్ 5వ తేదీన అతనికి సోషల్ మీడియా ద్వారా ఆ బర్త్డే విషెస్ చెప్పాడు.దీనితో ఈ పోస్ట్ కు యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో సహా అనేకమంది కామెంట్లు చేశారు. సార్ అతడు నీకు అబద్ధం చెప్పాడు అతను పుట్టినరోజు రేపు అంటూ కామెంట్ పెట్టారు.

https://www.instagram.com/p/CUpDOycMbKj/?utm_source=ig_web_copy_link

అంతేకాకుండా ఈ పోస్ట్ ను ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేస్తూ ఆ పోస్ట్ ను సన్నీ కి ట్యాగ్ చేశాడు. రేపు నీ పుట్టినరోజు అయితే బాహుబలికి ఎందుకు అబద్దం చెప్పావు? అని ప్రశ్నించాడు దీనికి స్పందించిన సన్ని బహుబలి ఈరోజు పుట్టినరోజు జరుపుకోమన్నాడు. అందుకే నేను ఈరోజు బర్తడే జరుపుకుంటున్నాము. అయినా నువ్వు ఎందుకు మధ్యలో తల దూరుస్తున్నావు అని సరదాగా కౌంటర్ ఇచ్చాడు.