మా ఎన్నికలపై తారక్ రియాక్షన్.. మామూలుగా లేదుగా!

టాలీవుడ్‌లో ప్రస్తుతం ‘మా’ ఎన్నికల వేడి ఏ రేంజ్‌లో ఉందో మనకు తెలిసిందే. ఇప్పటికే ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు తాము విజయం సాధిస్తామని చెబుతుంటే, తాము విక్టరీ కొట్టి తీరుతామని మంచు విష్ణు ప్యానెల్ అంటోంది. అయితే మా ఎన్నికలపై పలువురు స్టార్ హీరోలు సైతం తమ మద్దతు ఎవరికనే విషయంపై ఇంకా స్పందించడం లేదు. ఈ కోవలో తాజాగా ఎన్టీఆర్ కూడా చేరారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లోని జీవితా రాజశేఖర్ ఈ అంశానికి సంబంధించి తాజాగా ఓ విషయాన్ని వెల్లడించారు.

ఈసారి మా ఎన్నికల్లో తాము నిలబడుతున్నామని, తమ ప్యానెల్ తోటి సభ్యులకు మద్దతివ్వాల్సిందిగా తారక్‌ను కోరిందట జీవిత. అయితే తనకు మా ఎన్నికలపట్ల ఏమాత్రం ఆసక్తి లేదని, ప్రస్తుతం మా ఎన్నికలు రాజీకయ ఎన్నికలను తలపిస్తున్నాయని, సినిమా రంగానికి ఇది ఏమాత్రం మంచిది కాదని అన్నాడట తారక్. ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులు చూస్తే తనకు బాధేస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపినట్లు జీవిత చెప్పుకొచ్చింది. అయితే తాను కూడా తారక్ చెప్పిన మాటలను ఏకీభవించానని ఆమె చెప్పుకొచ్చింది.

మొత్తానికి మా ఎన్నికల పోటీలో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ హద్దులు దాటుతుండటంతో ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొందని పలువురు అంటున్నారు. కాగా ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండగా, మంచు విష్ణు సీనియర్ హీరోలందరి మద్దతు సమకూర్చుకునే పనిలో పడ్డాడు. మరి ఈసారి మా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.