ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కోట శ్రీనివాసరావు..!

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఈ మధ్య కాలంలో పలు వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బృందావనం సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. బృందావనం సినిమా కంటే ముందు ఎన్టీఆర్ తో కలిసి కొన్ని సినిమాలు చేసినప్పటికీ కోటా కి మాత్రం బృందావనం సినిమానే సంతృప్తిని ఇచ్చిందట.

బృందావనం సినిమా షూటింగ్ సమయంలో తన కొడుకు చనిపోయాడని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. బృందావనం సినిమాలో ఎన్టీఆర్ చేసిన పాత్ర చాలా గమ్మత్తుగా ఉండే పాత్ర. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీహరి వంటి వారు నటించినప్పటికీ వారి పాత్రలనే డామినేట్ చేస్తూ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించాడని కోట శ్రీనివాసరావు తెలియజేశాడు.

బృందావనం క్లైమాక్స్ షూటింగ్ జరిగే సమయంలో కోట శ్రీనివాసరావు కు ఎడమ కంటి ఆపరేషన్ జరిగిందట. అంతే కాకుండా తన కొడుకు దుఃఖంతో కూడా తాను చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చాడు.ఒక పక్క షూటింగ్ జరుగుతుంటే నా అవస్థలు చూసి అక్కడున్న చిత్ర యూనిట్ సభ్యులు తనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారని చెప్పుకొచ్చాడు. దాంతో వారి అవస్థలను నేను గమనించి నేనే స్వయంగా వారితో కలిసి పోయి సన్నివేశాలను చేశానని కోట తెలియజేశాడు.

Share post:

Latest