నాగచైతన్యకు..మళ్లీ షాక్ ఇచ్చిన సమంత..?

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత మీద ప్రతి రోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఇక సమంత కూడా ప్రతిరోజూ ఏదో ఒక పోస్ట్ కూడా షేర్ చేస్తూ ఉంది. తాజాగా నాగ చైతన్య నుంచి సమంత విడిపోయిన తర్వాత నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను తొలగించినట్లుగా సమాచారం. అంతేకాదు చైతన్య తో విడిపోయిన అప్పటినుంచి సమంత తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి మొత్తం 80 చిత్రాలను కూడా ఆమె తొలగించినట్లు సమాచారం..

ఫ్రెండ్స్, ఫ్యామిలీ , పెట్ డాగ్స్ తో వున్న ఫోటోలను కాకుండా వీరిద్దరూ సపరేట్ గా కలిసి దిగిన ఫోటోలను మాత్రం ఆమె మెల్లగా తొలగిస్తూ వస్తోంది.. ఇంస్టాగ్రామ్ ద్వారా వీరిద్దరికీ సంబంధించిన అన్ని ఫోటోలు డిలీట్ చేశాక, నాగచైతన్యను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేస్తుందేమో చూడాలి.. ఇక సమంత నాగచైతన్య వివాహబంధానికి అక్టోబర్ 2వ తేదీన బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. సమంత తన జ్ఞాపకాలను శాశ్వతంగా చెరిపివేసి తీర్థయాత్రలకు వెళ్తుండగా, చైతు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.