మెగా ఫ్యామిలీతో రాఘవేంద్రరావు సినిమా.!

దర్శక నిర్మాతలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా పౌరాణిక చిత్రాలపైనే సినిమాలు తెరకెక్కించడం జరుగుతోంది. ఇక ఇప్పుడు తాజాగా రాఘవేంద్రరావు కూడా రామాయణం సినిమాని తీయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. అందుకుగాను నటులుగా మెగా ఫ్యామిలీ లో నుంచి హీరోలను ఎంపిక చేస్తున్నట్లుగా సమాచారం. అందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి అన్నట్లుగా తెలుస్తోంది.

రామాయణం గాథని అందరికీ చాటి చెప్పాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తోంది. స్టార్ నటులతో ఈ కథను చూపించాలని భావిస్తున్నారట రాఘవేంద్ర రావు. అయితే ప్రభాస్ కూడా ఆదిపురుష్ సినిమా కూడా రామాయణం కథనే తెరకెక్కించ బడుతోంది. కానీ వీటన్నింటికి భిన్నంగా రామాయణాన్ని కొత్త పద్ధతిలో ఆవిష్కరిస్తారని తెలియజేస్తున్నాడు డైరెక్టర్.

ఇప్పటివరకు ఇలాంటి క్రేజీ ఉన్న సినిమాలను మొత్తం రెండు విభాగాలుగా చూపించారు. అయితే ఇప్పుడు రాఘవేంద్ర రావు ఈ సినిమాని ఎలా తెరకేక్కిస్తాడనే విషయం ప్రతి ఒక్కరి లోను సందేహంగా మారింది. అంతేకాకుండా హీరోగా ఎవరు నటిస్తారనే విషయం కూడా మెగా అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.