మీ కూతుర్లకు కావాల్సింది అది కాదు.. ఇది అంటున్న సమంత..?

సమంత , నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తరువాత మై మామ్ సెడ్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ తో రోజుకు ఒక మంచి మాటను పోస్ట్ చేస్తూ వైరల్ అవుతోంది.. తాజాగా తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ప్రసారం చేయవద్దని కోర్టులో పిటిషన్ వేసి విజయవంతమైంది.. సమంత పర్సనల్ విషయానికి సంబంధించిన ఏ వార్త కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేయకూడదని కూకట్పల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సమంత కూడా తన పర్సనల్ మ్యాటర్స్ ఏవి కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవద్దు అని చెప్పింది కోర్టు..

అందుకే ఈమె సమాజానికి మెసేజ్ ఇస్తూ మంచి కొటేషన్స్ తో పోస్టులు కూడా పెడుతోంది. ఇప్పుడు మీరు ఇలా ఉన్నందుకు.. కృతజ్ఞతతో ఉండండి .. రేపు మీరు ఏం కావాలనుకుంటున్నారో దాని కోసం పోరాడుతూ ఉండండి.. అంటూ మొన్న పోస్ట్ ఒకటి పెట్టి, ఇప్పుడు తాజాగా మరో కొటేషన్ ని పోస్ట్ చేసింది..మీ కూతుళ్ళ పెళ్లిళ్ల కోసం డబ్బులు ఆదా చేయవద్దు.. వారిని బాగా చదివించండి.. వాళ్ళ కాళ్లపై వారు నిలబడేలా పెంచండి అంటూ కొటేషన్ పెట్టిన సమంత..


మీ కూతుళ్లను ఎవరు పెళ్లి చేసుకుంటారు అనే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.. ఆమె పెళ్లి కోసం డబ్బులు ఆదా చేసే బదులు.. మంచి చదువులు చదివి తన కాళ్ళపై తాను నిలబడేలా చేయండి.. అలాగే పెళ్ళికి సిద్ధం చేసే ముందు తన కోసం తనను సిద్ధం చేయడం చాలా ముఖ్యం. విశ్వాసంతో బ్రతకడం నేర్పించండి.. అంతేకాదు అవసరం ఉన్న సమయంలో ఒక మార్గదర్శకంగా ఉండేలా సిద్ధం చేయండి అంటూ సమంత అందరికీ సందేశం ఇచ్చింది. ప్రస్తుతం ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share post:

Latest