మీ సెల్ ఫోన్ లో ఎంత రేడియేషన్ వుందో ఇలా చెక్ చేయండి..!

ప్రపంచాన్ని మన గుప్పెట్లో ఉంచే అతి ముఖ్యమైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది కేవలం స్మార్ట్ ఫోన్ మాత్రమే.. ప్రపంచం నలుమూలల ఎప్పుడు ఏ విషయం ఎక్కడ జరిగినా కేవలం రెప్పపాటు నిమిషంలోనే మనకు తెలిసిపోతుంది.. ముఖ్యంగా ఇంటర్నెట్ పుణ్యమా అని ప్రతి ఒక్క విషయం స్మార్ట్ ఫోన్ లోనే తెలుసుకునే అవకాశం లభిస్తోంది. ఈ క్రమంలోనే రోజురోజుకు స్మార్ట్ఫోన్ వినియోగదారులు కూడా ఎక్కువ అవుతున్నారు అని చెప్పాలి.

 

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మొబైల్ చూడందే సమయం గడవదు.. అలాంటప్పుడు మొబైల్ రేడియేషన్ కు మనం గురికాక తప్పదు. కానీ మన సెల్ ఫోన్ ఎంత రేడియేషన్ ఉత్పత్తి చేస్తోంది దీని వల్ల మనకు ఎంత ప్రమాదం ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయవలసిందల్లా “*#07#” అని ఈ నెంబర్ కు మీ స్మార్ట్ఫోన్ డైల్ పాడ్ లో ఎంటర్ చేస్తే మీ మొబైల్ లో ఎంత రేడియేషన్ ఉత్పత్తి అవుతోంది ఇట్టే చూపిస్తుంది.

1.6W/KG రేడియేషన్ కంటే తక్కువగా ఉంటే మీ ఫోన్ సురక్షితం అని తెలుసుకోవాలి . ఒకవేళ అంత కంటే ఎక్కువ ఉంటే వెంటనే మీ ఫోన్ మీరు మార్చుకోవడమే మంచిది..