మానవ మృగం.. అందరి ముందే మహిళను అత్యాచారం..వీడియోలు..ఫోటోలు తీస్తూ..!!

మనుషులలో మానవమృగాలు రోజురోజుకు పెరిగి పోతున్నారు అనే దానికి ఇది ఒక చక్కటి నిదర్శనం అని చెప్పవచ్చు.. సాధారణంగా ఎక్కడో ఒక మహిళ అత్యాచారానికి గురైతే ఆ రాక్షసుడిని నిందించాలి.. శిక్షించాలి.. చంపేయాలి అంటూ కొవ్వొత్తులు పట్టుకొని తిరుగుతారు.. కానీ అందరి ముందు ఒక మహిళని ఒక మానవ మృగం అత్యాచారం చేస్తోంటే.. ఏ ఒక్కరూ ఆ మహిళకు సహాయ పడకపోగా వీడియోలు , ఫోటోలు తీస్తూ ఎంజాయ్ చేశారు. ఇంతకంటే ఘోరం బహుశా మరెక్కడా ఉండదేమో..

Woman raped on metro train, passengers just watched - USA

పూర్తి వివరాల్లోకి వెళితే..అమెరికాలోని పెన్సిల్వినేయాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు 69వ వీధి రవాణా కేంద్రం వైపు మార్కెట్-ఫ్రాంక్‌ఫోర్డ్ లైన్‌ మీదుగా రాత్రి పది గంటల ప్రాంతంలో రైలు ప్రయాణం చేస్తుంది. అదే ట్రైన్‌లో నిందితుడు ఫిస్టన్‌ ఎన్‌గోయ్‌ కూడా ఉన్నాడు. బాధితురాలి పక్కనే కూర్చుని ఉన్నాడు. పలుమార్లు ఆమెను అసభ్యకరంగా తాకాడు. ఆమె ప్రతిఘటించినప్పటికి అతడి తీరు మార్చుకోలేదు. ఆ సయమంలో ట్రైన్‌లో బాధితురాలితో పాటు కొద్ది మంది ప్రయాణికులు కూడా ఉన్నారు.

రైలులో ఉన్న ప్రయాణికులు ఫిస్టన్‌ అనుచిత చర్యలను చూస్తూ ఉన్నారే కానీ.. ఎవరు ముందుకు వచ్చి అతడిని వారించే ప్రయత్నం చేయలేదు. దాంతో మరింత రెచ్చిపోయిన ఫిస్టన్‌ ప్రయాణికులందరూ చూస్తుండగానే.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనను కాపాడాల్సిందిగా ఎంత ప్రాధేయపడినా.. ఎవరు ఆమెకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. చివరకు రైల్వే ఉద్యోగులు కూడా ఆమెకు సాయం చేయలేదు. కనీసం ఎమర్జెన్సీ నంబర్‌కు కూడా కాల్‌ చేయలేదు.40 నిమిషాల పాటు ఈ దారుణం జరిగింది. ఆ తర్వాత రైలులోకి వచ్చిన ఓ వ్యక్తి జరిగిన దారుణాన్ని గుర్తించి పోలీసులకు కాల్‌ చేశాడు. ప్రస్తుతం పోలీసులు ఫిస్టన్‌ని అరెస్ట్‌ చేశారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

SEPTA Transit Police Chief Thomas Nestel III, left, and SEPTA General Manager Leslie Richards, right, address reporters at the 69th Street Transportation Center.

Share post:

Popular